చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ ను గెలిపించండి

చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ ను గెలిపించండి

రచ్చబండ, శంకర్ పల్లి: ఈసారి చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న షాబాద్ భీమ్ భరత్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన సతీమణి జ్యోతి తెలిపారు. శుక్రవారం శంకర్ పల్లి మండలం రావులపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని జోష్యం చెప్పారు. పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గంలోని గ్రామాలలో అనుకున్నంత అభివృద్ధి పనులు చేయలేదని తెలిపారు. ఇప్పటికీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

సీఎం కేసీఆర్ కల్లబొల్లి మాటలకు ఓటర్లు మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రకటించిన ఆరు ఎన్నికల హామీలను 100% పూర్తి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్, వార్డు సభ్యులు వెంకటరెడ్డి, మన్య శ్రీనివాస్, కృష్ణమూర్తి, శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.