Chevella MLA Kale Yadaiah.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీదే అధికారం.. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం
* చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
* శంకర్ పల్లి మండలంలో ఇంటింటి ప్రచారం
రచ్చబండ, శంకర్ పల్లి: తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం శంకర్ పల్లి మండలంలోని మహాలింగాపురం, గాజులగూడ, లక్ష్మారెడ్డి గూడ గ్రామాలలో ఆశీర్వాద యాత్రలో పాల్గొని ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడవసారి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతం అన్ని విధాలుగా దోపిడీకి గురైందని తెలిపారు. సాగునీరు, త్రాగునీరు లేక ప్రజలను గ్రామాలను విడిచి వలస పోయారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని తెలిపారు. మళ్లీ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులు పాలవుతుందని గుర్తు చేశారు. ఎన్నికలు వస్తేనే వారు ఊళ్ళలోకి వస్తారని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కారం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేసి అధిక ఎమ్మెల్యేలను గెలిపించాలని ఓటర్లను కోరారు. కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలను ఏడాదైన అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని తెలిపారు. ఐదు హామీలు అక్కడి రైతులను కర్ణాటక సర్కార్ ఆగం చేస్తున్నదని చెప్పారు. మూడు గంటల కరెంటు సరఫరా చేస్తూ రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నదని ఆరోపించారు.
చేవెళ్ల నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 30 ఎస్సీ రిజర్వుడ్ ఎమ్మెల్యే స్థానాలలో చేవెళ్లను నెంబర్ వన్ గా ఎమ్మెల్యే కాలే యాదయ్య ను వినిపించాలని ఓటర్లను కోరారు. కాగా మండలంలోని కొండకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువాలు కప్పి వారిని ఎమ్మెల్యే గాలి యాదయ్య పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మండల, మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్ కన్నా, ఉపాధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ పాపారావు, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, సాతా ప్రవీణ్ కుమార్, పాండురంగారెడ్డి, పార్శి బాలకృష్ణ, గోవర్ధన్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.