గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ

గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
* చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

రచ్చబండ, శంకర్ పల్లి : గ్రామాల అభివృద్ధి పై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం లోని మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ లో కోటి తొంబై లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 9 సంవత్సరాల పాలనలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు.

ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, బీటీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ మురికి కాలువలు చేపట్టడం జరిగిందన్నారు. వీటితో పాటు హరితహారం కార్యక్రమం చేపట్టి గ్రామాలను హరితంగా మార్చారని తెలిపారు. ప్రతి సంవత్సరం మొక్కలు నాటడంతో ఏ గ్రామం చూసిన పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయని తెలిపారు. మిషన్ భగీరథ పథకం చేపట్టి ప్రతి గ్రామానికి తాగునీటిని సీఎం కేసీఆర్ అందిస్తున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, వైస్ చైర్మన్ కుర్మా వెంకటేష్, రాయదుర్గం పిఎసిఎస్ చైర్మన్ అరవింద రెడ్డి, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ గ్రామ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్, మహరాజ్ పెట్ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ శాంతి కిషన్ సింగ్, మిర్జాగూడ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఒగ్గు అంజయ్య, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, నరసింహ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.