గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
రచ్చబండ, శంకర్ పల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని 22వ తేదీ అర్ధరాత్రి మృతి చెందిన సంఘటన శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ బ్రిడ్జి వద్ద జరిగింది. స్థానిక సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శంకర్ పల్లి మండలంలోని ఏరువా కూడా గ్రామానికి చెందిన కుసుమ గళ్ళ వెంకటేష్(31) వృత్తి వ్యవసాయం, నవాబు పేట్ మండలంలో ని మన్ సాను పల్లి గ్రామానికి చుట్టాల వద్ద జరిగే డిన్నర్ కు వెళ్లి తిరిగి అర్ధరాత్రి తన పల్సర్ బైక్ నెంబర్. టి ఎస్07 జె ఎక్స్3991 పై ఏరువ గూడ గ్రామానికి వస్తుండగా మధ్య రాత్రి పతేపురం ఓవర్ బ్రిడ్జ్ వద్దకు రాగానే ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్ల వెంకటేష్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతుని భార్య స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.