కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు

కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు
* సీపీఐ శంకర్ పల్లి మండల కార్యదర్శి సుధీర్ కుమార్

రచ్చబండ, శంకర్ పల్లి: కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీలు ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నాయని సీపీఐ శంకర్ పల్లి మండల కార్యదర్శి పీ సుధీర్ కుమార్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఇంటింటికి సిపిఐ గోడ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధీర్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను, కర్షకులను ఇబ్బందులు పాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజాక్షేత్రంలో వీరి పాలనలను ఎండగడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి మధ్యతరగతి, పేద ప్రజల నడ్డి విరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఆదాని, అంబానీ లకు దేశ సంపదను దోచిపెడుతున్నదని తెలిపారు. బిజెపి ప్రభుత్వం పడుతున్న విధానాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని కేంద్ర సిపిఐ పార్టీ పిలుపుమేరకు ఈరోజు శంకర్ పల్లిలో కార్యకర్తల సమక్షంలో పోస్టర్ ను విడుదల చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గంగయ్య, పి నర్సింలు, బుచ్చయ్య, సాయిలు, ఎస్. చంద్రమౌళి, కిష్టయ్య పాల్గొన్నారు.