కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు చేవేళ్ల ఎమ్మెల్యేకు లేదు

కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు చేవేళ్ల ఎమ్మెల్యేకు లేదు
* టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

రచ్చబండ, శంకర్ పల్లి: కాంగ్రెస్ కార్యకర్తలు వేసిన ఓట్లతో గెలిచి శాసనసబలోకి అడుగు పెట్టిన కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అని టీపీసీసీ ప్రధానకార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.

మంగళవారం అయన మాట్లాడుతూ చేవెళ్లలో జరిగిన ఎస్సీ, ఎస్టి డిక్లరేషన్ పై అయన మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు తో గేలేచి అధికార భారస లో కి వెళ్లిన ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం గుణపాఠం చెబుతారని అన్నారు. కాంగ్రెస్ లో పలు రకాల పదువులు అనుభవించి బారసాలో చేరటము సిగ్గుచేటు అన్నారు.

బారసా ఎన్నికల హామీలో ప్రకటించిన దళితుడికి ముఖ్యమంత్రి పదవి,3 ఎకరాల భూ పంపిని ఏమైంది అని ప్రశ్నించారు. విలువైన రంగారెడ్డి జిల్లా భూముల అమ్మకముతో వచ్చిన సొమ్మును జిల్లా అభివృద్ధికి ఏ విధంగా ఖర్చు చేశారో తెలుపాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రములో కెసిఆర్ కుటుంబ పాలన, చేవెళ్లలో కాలే యాదయ్య కుటుంబ పాలనను గద్దె దించే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం చేస్తారు అన్నారు.