కాంగ్రెస్ ను నమ్మితే ఆగమైపోతరు.. బీఆర్ఎస్ తోనే భవిష్యత్తు

కాంగ్రెస్ ను నమ్మితే ఆగమైపోతరు.. బీఆర్ఎస్ తోనే భవిష్యత్తు
* చేవెళ్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య
* శంకర్ పల్లి పట్టణంలో ఇంటింటి ప్రచారం

రచ్చబండ, శంకర్ పల్లి: కాంగ్రెస్ ను నమ్మితే ఆగమైపోతరు.. బీఆర్ఎస్ పార్టీ తోనే భవిష్యత్తు.. అని గుర్తించాలని చేవెళ్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ లోని 2, 3, 7, 11, 12, 13, 14, 15 వ వార్డుల పరిధిలో ప్రజా ఆశీర్వాద యాత్రలో బాగంగా ఇంటింటి కి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని కుటుంబాలన్నిటికీ ఉచితంగా ఐదు లక్షల బీమా చేయించడం చాలా గొప్ప విషయం అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో  పేద మధ్యతరగతి కుటుంబాల కోసమే ఆలోచించి రూపొందించామని, దేశంలోనే ఎక్కడ లేని విధంగా 24 ఉచిత కరెంటు రైతులకు అందించి రైతు పక్షపాతిగా నిలిచిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు.

కాంగ్రెస్ కొత్తగా తీసుకువచ్చిన మేనిఫెస్టోను ప్రజలు ఎవరు నమ్మడం లేదని అన్నారు. కాంగ్రెసు ను నమ్మితే ప్రజలు ఆగమైపోతారని అన్నారు. నిన్న మొన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన సౌభాగ్య లక్ష్మి పథకానికి విశేష స్పందన వస్తుందని అన్నారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో ప్రతి ఒక్కటి అమలు చేసిందని, అందుకే ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బిఆర్ఎస్ వైపే ఉన్నారని రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై మరోసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించి కెసిఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారని అన్నారు.

అలాగే మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చి చేవెళ్ల అభివృద్ధి కోసమై పంపారని తెలిపారు. మూడోసారి కూడా అధిక మెజార్టీతోనే ఆశీర్వదించాలని కోరారు. కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలను ఏడాదైనా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నేరవేర్చలేదని… ఐదు హామీలు ఇచ్చి అక్కడి రైతులను కర్ణాటక సర్కారు ఆగం చేసిందని, మూడు గంటల కరెంటు ఇస్తుందని అన్నారు. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంటు ఇస్తోందని… కేసీఆర్ సర్కారు వస్తే మూడు పంటలకు నీళ్లు…24 గంటల కరెంటు ఇస్తుందని పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్ రూ.5016, వికలాంగులకు రూ.6016, రూ.400 లకే గ్యాస్ సిలిండర్, కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం ద్వారా రూ. 5లక్షలు, కేసీఆర్ ఆరోగ్యరక్ష రూ.15 లక్షలకు పెంపు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, రైతుబంధు ఎకరాకు రూ.16వేలు, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా రూ. మూడు లక్షల సాయం, అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం, మహిళా సంఘాలకు సొంత భవనాలు హామీలను మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని తెలిపారు. అధికారంలోకి రాగానే ఈ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మండల, మున్సిపల్ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్ కన్నా, ఉపాధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి. యూత్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ పాపారావు, నాయకులు సాతా ప్రవీణ్ కుమార్, చేకూర్త గోపాల్ రెడ్డి, పి. బాలకృష్ణ, బి సోలా అశోక్ కుమార్, జూలకంటి పాండురంగారెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.