చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలే యాదయ్యను మళ్లీ గెలిపించుకుందాం

చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలే యాదయ్యను మళ్లీ గెలిపించుకుందాం

 

* శంకర్ పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్

* మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం

 

రచ్చబండ, శంకర్ పల్లి: టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ఓటు వేయాలని సోమవారం శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ ఓటర్లను ఇంటింటికి తిరిగి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే వస్తుందని తెలిపారు. ఓటర్లు కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో కాలే యాదయ్యను గెలిపించాలని కోరారు.

మళ్లీ సీఎం కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో రామరాజ్యం వస్తుందన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓటు వేస్తే రాష్ట్రం అధోగతి అవుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కౌన్సిలర్లు చంద్రమౌళి, జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి, సింగాపురం మాజీ సర్పంచ్ విఠలయ్య, శంకర్ పల్లి మాజీ ఉపసర్పంచ్ సాతా ప్రవీణ్ కుమార్, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు మహమూద్ తదితరులు పాల్గొన్నారు.