ఎంసీజేలో సత్తాచాటిన శంకర్ పల్లి వాసి

ఎంసీజేలో సత్తాచాటిన శంకర్ పల్లి వాసి

రచ్చబండ, శంకర్ పల్లి; ఎంసీజేలో రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎండీ సలీం సత్తా చాటారు. రాష్ట్ర టియుడబ్ల్యూజే, ఐజేయు రాష్ట్ర ప్రచార కార్యదర్శి సలీం పాషాను బుధవారం శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య తన చాంబర్లో సలీం పాషాను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాస్టర్ ఆఫ్ జర్నలిజం ఫలితాల్లో ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణులవడం సంతోషం అన్నారు. కాగా 30 ఏళ్లుగా రంగారెడ్డి జిల్లాలో సీనియర్ జర్నలిస్టుగా వివిధ పత్రికలలో పనిచేసిన సలీం ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిఆర్ఓ గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ మాజీ విద్యార్థి నేతగా సలీం బీకాం, బీసీజె, ఎల్.ఎల్.బి, తో మూడు బ్యాచిలర్ డిగ్రీలు, ఒక మాస్టర్ డిగ్రీ చేశారు. తాజాగా సోమవారం వచ్చిన ఎంసీఏ ఫలితాల్లో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులై సత్తా చాటారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ రవీందర్, ఏపీవో నాగభూషణం, ఏపీఎం భీమయ్య పాల్గొన్నారు.