ఈట‌ల రాజేందర్ ఎక్క‌డుంటే అక్క‌డ అన్న‌దానం

రచ్చబండ, నల్లగొండ ప్రతినిధి : మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఒక క్రేజీ ఉంది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి శామీర్ పేటలోని ఆయన ఇల్లు ఒక అన్నదాన కేంద్రంగా వెలసిల్లింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా ఎందరో నేతలకు, కార్యకర్తలకు నిత్యం అన్నదాన సంత్రంగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు.

టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మంత్రిగా వైదొలిగాక బీజేపీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ ఆయన శామీర్ పేట ఇల్లుతో పాటు హుజూరాబాద్ నివాసం కూడా వేలాదిమందికి నిత్యాన్నదాన సత్రంగా నిరూపణ అయింది.

ప్రస్తుతం మునుగోడులో ప్ర‌తినోటా అదే చ‌ర్చ‌ జరుగుతోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ఎక్క‌డ ఉంటే అక్క‌డ అన్న‌దానం కొన‌సాగుతుంద‌ని ఇక్కడి ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క నాయ‌కుడు ఇలా భోజ‌నం ఏర్పాటు చేయ‌రంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా నిత్యం మునుగోడులో ప్ర‌చారానికి వ‌స్తున్న ఈట‌ల అత్తగారి ఊరైన ప‌లివెల గ్రామంలో వ‌చ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు.

ఈట‌ల‌ను చూసేందుకు పలివెల గ్రామానికి జిల్లాలోని పలు గ్రామాల నుంచి ఆయ‌న అభిమానులు, చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు వ‌స్తున్నారు. వ‌చ్చిన వారికి అంద‌రికీ భోజనాలు ఏర్పాటు చేసి అంద‌రి క‌డుపు నింపుతున్నార‌ని వ‌చ్చిన వారు చ‌ర్చించుకుంటూ ఉన్నారు.