ఇండ్ల పన్నులు నూరు శాతం వసూలు చేయాలి..

ఇండ్ల పన్నులు నూరు శాతం వసూలు చేయాలి.. గ్రామాలభివృద్ధికి పాటుపడాలి

* అధికారులకు శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య పిలుపు

 

రచ్చబండ, శంకర్ పల్లి: గ్రామాలలో 100% ఇంటి పన్నులు, ఇతరత్రా పనులు వసూలు చేసి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాటుపడాలని ఎంపీడీవో వెంకయ్య తెలిపారు. శుక్రవారం శంకర్ పల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో వారాంతపుసమీక్ష సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ జి పి డిపి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను పూర్తి చేయాలని సూచించారు. విశ్వకర్మ పథకాన్ని అమలు చేయాలని చెప్పారు. గ్రామాలలో నర్సరీలను పెంపొందించుకోవాలని, నర్సరీల నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

 

గ్రామాలలో ఉపాధి హామీ పనులను పెంచాలని చెప్పారు. గ్రామాలలో ఇంటి పరిసరాలను, రోడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎంపీఓ గీత, ఏపీవో నాగభూషణం, ఆయా గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.