ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకున్న తోటి స్నేహితులు

ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకున్న తోటి స్నేహితులు

రచ్చబండ, శంకర్ పల్లి: ఆపదలో ఉన్న స్నేహితుల కోసం స్నేహం కోసం ఎల్లకాలం అండగా ఉంటామని మహా లింగపురం 1998-1999 బ్యాచ్కు చెందిన 10వ తరగతి విద్యార్థులు స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. ఆలం కాన్ గూడ గ్రామానికి చెందిన మిత్రుడు విక్రమ్ రెడ్డి (40) ఇటీవల మృతి చెందడంతో అతని భార్య సునీత ఇద్దరు ఆడపిల్లలు అనాధలు కావడంతో విక్రం రెడ్డి యొక్క పదవ తరగతి విద్యార్థుల మిత్ర బృందం సుమారు 40మంది స్నేహితులు విక్రమ్ రెడ్డి ఇద్దరు ఆడపిల్లలకు రూ.1,40,000 అందించారు.

అలాగే కుటుంబ ఉపాధి కొరకు భార్యకు రెండు కుట్టుమిషన్లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా మిత్ర బృందం మాట్లాడుతూ తన మిత్రుడు విక్రమ్ రెడ్డి లా ఎవరు కూడా అగైత్యానికి పాల్పడకూడదని ఎలాంటి సమస్య ఉన్న మిత్రులకు తెలియజేసే తన వంతు సహకారంగా చేదోడు వాదోడుగా ఉంటామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, బక్కయ్య, శ్రీనివాస్ చారి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రాం రెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, జయమ్మ, వనమాల, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.