ఆదర్శమూర్తి అంబేద్కర్

ఆదర్శమూర్తి అంబేద్కర్ (కవిత)

ప్రపంచ మేధావి, ఆధునిక భారత రాజ్యాంగ రూపశిల్పి
బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి
భారతరత్న బిరుదాంకితుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
దేశ శ్రేయస్సు కోరి సమసమాజ నిర్మాణం కోసం పరితపించిన సమతామూర్తి అంబేద్క
ర్ఆధునిక భారత రాజ్యాంగ రచన కోసం తన కుటుంబాన్ని సైతం వదులుకొన్న త్యాగశీలి అంబేద్కర్
నిద్రాహారాలు మానుకొని నిమ్న వర్గాల అభ్యున్నతికై పాటుపడిన నిరంబరుడు అంబేద్కర్
కర్షక, కార్మిక కష్టజీవుల హక్కుల సాధనకై కదం తొక్కిన కర్మయోగి అంబేడ్కర్
మాతతా శిశు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోరిన మమత మూర్తి అంబేద్కర్
ఉద్యోగుల పని గంటల పరిమితికై పాటుపడిన ఉదారవాది అంబేద్కర్
చిన్న రాష్ట్రల అభివృద్ధికై పెద్ద రాష్ట్రాల విభజనకు మొగ్గు చూపిన వివేకవంతుడు అంబేద్కర్
సమాజంలో కుల, మత, పేద, ధనిక, లింగ వివక్ష లేకుండ అన్ని వర్గాలకు అక్షర సంపద అందాలని అహర్నిశలు పాటుపడిన ఆదర్శమూర్తి అంబేద్కర్
అందుకే నేడు అన్ని వర్గాల మన్ననలు పొందిన అందరివాడు అంబేద్కర్
నీ అడుగులు అభివృద్ధి వైపు పడాలని ఇప్పటికీ ఎత్తిన చెయ్యి దించక..
చూపుడు వేలు వంచక, వాడవాడన, వీధి వీధిన, దేశ విదేశ నగర నడి బొడ్డున నిలిచిన నవయుగ పురుషుడు అంబేద్కర్
మన మహానగరానికి మణిహారమైన సాగరతీరాన నేడు నిలువెత్తు నిలిచిన 125 అడుగుల మహా జ్ఞానశిఖరం మన అంబేద్కర్


రచన : మర్పల్లి అశోక్, ఉపాధ్యాయుడు, శంకర్ పల్లి, 9966181719