అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి

రచ్చబండ, శంకర్ పల్లి: అనుమానాస్పద స్థితిలో గ్యాస్ పైప్ లైన్ కోసం తవ్విన గుంతలో ఒక వ్యక్తి శవం లభ్యమయింది. ఈ సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. శంకర్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫతేపూర్ ఫ్లైఓవర్ కింద గ్యాస్ పైప్ లైన్ కోసం తవ్విన గుంతలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమయింది.

శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫతేపూర్ గ్రామానికి చెందిన హనుమ గళ్ళ రవీందర్ (38) ఈనెల 16వ తేదీ శుక్రవారం బయటకు వెళ్లి రాత్రి ఇంటికి వెళ్లలేదు. 17వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సమయంలో ఫతేపూర్ ఫ్లైఓవర్ వంతెన కింద గ్యాస్ పైప్ లైన్ కోసం తవ్విన గుంతలో రవీందర్ శవం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

గ్యాస్ పైప్ లైన్ కోసం తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా? ఎవరైనా చంపి గుంతలో పడవేశారా? అనే వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.