అటెండర్ రాజు కుటుంబానికి మండల ఉపాధ్యాయ జేఏసీ 2 లక్షల ఆర్థికసాయం

అటెండర్ రాజు కుటుంబానికి మండల ఉపాధ్యాయ జేఏసీ 2 లక్షల ఆర్థికసాయం

రచ్చబండ, శంకర్ పల్లి: ఇటీవల అకాల మృతి చెందిన ఎం ఆర్ సి లో అటెండర్ గా పనిచేస్తున్న రాజు కుటుంబానికి శంకర్ పల్లి ఉపాధ్యాయ జేఏసీ రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని మంగళవారం శంకర్ పల్లి ఎస్బిఐ బ్యాంకులో రాజు కుమారుని పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ మాట్లాడుతూ మండలంలోని టీఎస్ జిహెచ్ ఎంఏ, ఎస్ టి యు, పి ఆర్ టి యు, టీఎస్ యుటిఎఫ్, టిపియూఎస్, టిటిసి, టీఎస్ సిపి ఎస్ఇయు సంఘాలు కలిసి మృతి చెందిన రాజ కుమారుని పేరా స్థానిక ఎస్బిఐ బ్యాంకులో 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం సంతోషకరమన్నారు.

చదువుకై భవిష్యత్తులో ఎంతటి సహాయ సహకారాలు అందించడానికి మండల ఉపాధ్యాయ సంఘాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అందుకు ఎంఈఓ ఉపాధ్యాయ సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజిటెడ్ ఉపాధ్యాయులు నరహరి, జయసింహారెడ్డి, సురేందర్ రెడ్డి, తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మహేశ్వరరావు, తాహిర్ అలీ, రాజశేఖర్, శివకుమార్, శ్రీనివాస్, పాప గారి ఆశీర్వాదం, యాదయ్య, బాలరాజు, కృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, వనజ, పద్మజ, నాగేష్, సదాలక్ష్మి, రాములు, గోపాల్, ఆసిఫ్ ఖాన్, రవి కాంత్ రెడ్డి, వెంకటేష్, భక్తప్ప, హరి, రాజేశ్వరి, ప్రణీత సి ఆర్ పి లు, రాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.