మోకిలాలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తా

  • బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గోపాలచారి

రచ్చబండ, శంకర్ పల్లి: మోకిలా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోపాలచారి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అందరివారికి అవి అందేలా చూస్తానని చెప్పారు. మోకిలా గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు తనపై నమ్మకం ఉంచి గ్రామ అధ్యక్షునిగా ఎంపిక చేయడం పట్ల గోపాల చారి కృతజ్ఞతలు తెలిపారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.