శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘే

రచ్చబండ : శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘే బుధవారం ఎన్నికయ్యాడు. పార్లమెంట్ లో 225 మంది ఎంపీ ఓట్లకు గాను 223 ఓట్లు పోలయ్యాయి. త్రిముఖ పోటీలో 134 ఓట్లతో రణిల్ విక్రమ్ సింఘే ఎన్నికయ్యారు.

అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక విక్రమ్ రణసింఘే మాట్లాడారు. శ్రీలంకను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని, ప్రజలు అంతవరకూ ఆందోళనను జరపొద్దని హితవు పలికారు.