నాన్నా నువు గ్రేట్‌.. మునుగోడు ప్రజలదే గెలుపు.. రాజగోపాల్‌ రెడ్డి తనయుడు సంకీర్త్‌ రెడ్డి పోస్టు వైరల్‌

రచ్చబండ : మునుగోడు ఉప ఎన్నికల్లో పోటాపోటీ ప్రచారం కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నడుమ ప్రధాన పోటీ నెలకొంది. తాజాగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తనయుడు ట్విట్టర్‌లో చేసిన ఓ పోస్టు సంచలనంగా మారింది. ఆయన పోస్టు కూడా ప్రజల్లో ఆలోచనను రేకెత్తించింది. ఆ పోస్టు సారాంశం కింది విధంగా ఉంది.

‘’టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది రాష్ట్ర మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, 8 నుంచి 10 మంది ఎంపీలు మరియు అపారమైన డబ్బు, పోలీస్‌ బలగాలు వర్సెస్‌ ఒంటరి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై పోరాడుతున్నారు. మునుగోడు ప్రజల కోసం అసెంబ్లీనే మోకాళ్లపైకి తెచ్చినందుకు.. నాన్నా నేను గర్విస్తున్నా.. ఇప్పటికే తీర్పు వెలువడింది. మునుగోడు ప్రజల హవా గెలిచింది..” అని సంకీర్త్‌ రెడ్డి పోస్టు చేశారు.

రేపు గెలుపు ఎవరిదైనా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తనయుడు సంకీర్త్‌ రెడ్డి పోస్టు మునుగోడు ప్రజల్లో ఆలోచనను రేకెత్తించింది. ఇది వైరల్‌ గా మారి వివిధ సోషల్‌ మీడియా గ్రూపుల్లో హల్‌ చల్‌ చేస్తోంది. దీన్నిబట్టి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ బలగమంతా ఒక్క మునుగోడుపైనే కేంద్రీకరించిందనే వాదనపై చర్చ నడుస్తోంది.