ఎక్కడ చూసినా ఈ జాతి రత్నాలే

నవీన్ పొలిశెట్టి హీరోగా ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన జాతిరత్నాలు మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ బాధ్యత మొత్తం కూడా నవీన్ తన భుజాలపై వేసుకుని మరో ప్లాన్ చేసుకున్నాడు. సోషల్ మీడియా.. వెబ్ మీడియా నుండి మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా ఇతర మీడియాల్లో కూడా జాతి రత్నాల సినిమాకు సంబంధించిన టాపిక్స్ చర్చ జరిగేలా ప్లాన్ చేశారు. ఈటీవీ.. మాటీవీ.. జీటీవీ ఇలా అన్ని టీవీల్లోని ఫేమస్ రియాల్టీ షోల్లో జాతి రత్నాలు టీమ్ పాల్గొని సందడి చేసి తమ సినిమా ను ప్రచారం చేసుకుంటున్నారు. ఇక యూట్యూబ్ లో నవీన్ వీడియోలు వరుసగా ట్రెండ్డింగ్ లో ఉంటున్నాయి.