అయ్యప్ప ఆలయానికి అర కిలో వెండి

* శంకర్ పల్లి గీత కార్మిక సంఘం సభ్యుల భూరి విరాళం

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి పట్టణ పరిధిలోని హైదరాబాద్ రోడ్డు పక్కన నూతనంగా నిర్మిస్తున్న నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయానికి శంకర్ పల్లి గీత కార్మిక సంఘం సభ్యులు బుధవారం అర కిలో వెండిని విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా గీతా కార్మిక సంఘం అధ్యక్షుడు సట్టాగాల్ల సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ శంకర్ పల్లిలో భారీ ఎత్తున శ్రీ అయ్యప్ప స్వామి నూతన దేవాలయం నిర్మించడం సంతోషకరంగా ఉందన్నారు. భక్తితో తమకు తోచిన విధంగా అర కిలో వెండిని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశామని తెలిపారు.

కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ భాను వెంకటరామిరెడ్డి, శంకర్ పల్లి మాజీ ఉపసర్పంచ్ సాతా ప్రవీణ్ కుమార్, మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జూలకంటి పాండురంగారెడ్డి, గౌడసంఘం నాయకులు జొన్నాడ జగన్ గౌడ్, మోహన్ గౌడ్, దేవాలయ కమిటీ సభ్యులు మిరియాల శ్రీనివాస్, అడ్వకేట్ విశ్వేశ్వర్, కే.జంగయ్య, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.