Ex. MLA KS Ratnam.. చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తాం

Ex. MLA KS Ratnam.. చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తాం

* చేవెళ్ల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం

రచ్చబండ, శంకర్ పల్లి: చేవెళ్ల గడ్డపై ఈసారి బీజేపీ జెండాను ఎగురవేస్తామని ఆ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ అభ్యర్థి కేఎస్ రత్నం ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని మనీ గార్డెన్స్ లో మంగళవారం బీజేపీ బూత్ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు అధికమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తుంటే, చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.

ఎమ్మెల్యే భార్య, కోడలు నవాబుపేటలో జడ్పిటిసిగా, ఎంపీపీగా కొనసాగుతున్నారని, కుమారుడు మొయినాబాద్ లో జడ్పిటిసి పదవిలో ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారని, మళ్లీ ఆయన సీఎం అయితే గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములు, గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములను అమ్ముకుంటారని చెప్పారు. ఓటర్లు ఈసారి భారతీయ జనతా పార్టీ కి ఓటు వేసి తనను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. చేవెళ్ల నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ విటల్ మాట్లాడుతూ బూత్ కార్యకర్తలు గ్రామాలలో ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి అధిక ఓట్లు రాబట్టడానికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిజెపి అధికార ప్రతినిధి తొండ రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, చేవెళ్ల బిజెపి కన్వీనర్ ప్రతాపరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రాజకుమార్, మండల, మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు బసగాళ్ల రాములు గౌడ్, బీర్ల సురేష్, శంకర్ పల్లి ఏఎంసి మాజీ చైర్మన్ దేవుని పరమేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బీర్ల నరసింహ, మహాలింగాపురం గ్రామ మాజీ సర్పంచ్ బొజిరెడ్డి, మిర్జాగూడ మాజీ సర్పంచ్ పంతం సంజీవ, మండల బిజెపి ఉపాధ్యక్షుడు రాజేందర్ సింగ్, నాయకు లు బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, భయానంద్, కార్యకర్తలు పాల్గొన్నారు.