కారెక్కి దిగి సొంతగూటికి చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్

సూర్యాపేట :ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ రాజకీయ వేడి పుట్టుకొస్తుంది. ఇప్పుడిప్పుడే వలసలు సలసల కాగుతున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ తమ పార్టీల్లోకి చేరికలకు తెరలేపారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో వలసల పర్వం షురూ అయింది. ఈ దశలో నేరేడుచర్ల మున్సిపాలిటీలో 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రణపంగ నాగయ్య ఆదివారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

మరునాడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే పరంపరలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌన్సిలర్ రణపంగ నాగయ్య సోమవారం ఎంపీ ఉత్తమ్ సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.