6 గ్యారంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

6 గ్యారంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
* కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి షాబాద్ భీమ్ భరత్

రచ్చబండ, శంకర్ పల్లి: ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలకు ప్రకారం ఆరు గ్యారెంటీలకు అనుమతులు లభించాయని అందుకు ప్రజల నుండి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి షాబాద్ భీమ్ భరత్ తెలిపారు.

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా తండా గ్రామ పంచాయతీలో శుక్రవారం ప్రజల నుంచి స్వీకరించే దరఖాస్తుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలకు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రకటించిన ఆరు వాగ్దానాలు లభిస్తాయని చెప్పారు. అధికారు లు పేద ప్రజలను గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, నాయకులు ఉదయ్ మోహన్ రెడ్డి, దేవలా నాయక్, రాజు గౌడ్, నరసింహ గౌడ్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.