24న చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ మహాసభ
* విజయవంతం చేయండి
* మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి
రచ్చబండ, శంకర్ పల్లి: ఈనెల 24వ తేదీన చేవెళ్లలో జరిగే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ మహాసభను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని మాజీ మంత్రి, గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.
లక్ష పైచీలు జనంతో ఈ మహాసభను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. శంకర్ పల్లి మండలం, మునిసిపాలిటీలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున జన సమీకరణలు చేయాలని అన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ మహాసభ జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశంలోని రాష్ట్రాలలో పేద ప్రజల కోసం స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నో సంస్కరణలు చేపట్టి వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు.
ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చి ఎస్సీ, ఎస్టి పేదవర్గాల రైతులకు ఆ భూములను పంచిపెట్టి వారి జీవనోపాధికి పాటుపడ్డారని తెలిపారు. అలాంటి భూములను నేడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు బ్రోకర్లుగా మారి ఆ రైతుల వద్ద తక్కువ ధరలకు భూములను కొని, ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
కార్యకర్తలు పట్టుదలతో పని చేస్తూ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ ఇచ్చిన వారి గెలుపు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. బిజెపి మత పార్టీగా ఎదిగిందని ఆ పార్టీతో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి లాభం చేకూరాదని తెలిపారు. తప్పనిసరిగా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. ఉదయ్ మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, అధికార ప్రతినిధి సతీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్, చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం, దేశముల ఆంజనేయులు, భీమ్ భరత్, దర్శన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ ఎండీ ఎజాజ్, రషీద్ పటేల్, ప్రశాంత్, శ్రీకాంత్ రెడ్డి, యాదిరెడ్డి, అనిల్ కుమార్, పెంటయ్య, శమియోద్దీన్, ప్రసాద్, సుధాకర్ రెడ్డి, కందూరి పెంటయ్య, నక్క వెంకటయ్య, యాదవ రెడ్డి, బాలరాజు, శశికాంత్, శంకర్, చందిప్ప మోహన్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.