22న తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులివ్వాలి

22న తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులివ్వాలి

రచ్చబండ, హైదరాబాద్ : ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్బంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూసి వేయాలని ఆయన ఆదేశించారు.

అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 22న సెలవు ప్రకటించాలని పలువురు రామభక్తులు కోరుతున్నారు. అన్ని మద్యం దుకాణాలను మూసి ఉంచాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 22న ప్రతి ఇంటిలో శ్రీరామ జ్యోతి వెలిగించాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.