రాగి జావ తాగడానికి గ్లాసులు వితరణ

రాగి జావ తాగడానికి గ్లాసులు వితరణ
రచ్చబండ, శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని కొండకల్ తండాలో చదువుకునే విద్యార్థులకు పూర్వ విద్యార్థులు వసన్, గణేష్ స్టీల్ గ్లాసులు,వాటర్ బబుల్స్, రింగ్ బాల్స్ స్టేషనరీ అందించారు.

ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్,సమాజిక కార్యకర్త ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ విద్యార్థులలో పౌష్టికాహార లోపం నివారించడానికి ప్రభుత్వం ఇటీవల గవర్నమెంట్ బడులలో చదువుకునే విద్యార్థులకు ఉదయం సమయంలో రాగి జావా డ్రింకును అందివ్వడం జరుగుతుందనీ తెలిపారు.

కొంత మంది విద్యార్థులు ఉదయం ఇంటిదగ్గర టిఫిన్ తినకుండా టీ, పాలు, బ్రెడ్ తీసుకొని పాఠశాలకు వస్తుంటారని చెప్పారు. అలాంటి వారిలో రాగి జావా కొంతవరకు పౌష్టికాహార లోపాన్ని నివారిస్తుందని, కాబట్టి రాగి జావా తాగడానికి విద్యార్థులకు దాతలు అందించిన గ్లాసులు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు.

వాటర్ బబుల్స్, మగ్గులు, స్టేషనరీ, గేమ్స్ మెటీరియల్ తదితర వస్తువులను అందించిన పూర్వ విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ సేవ్యానాయక్, వసన్, గణేష్, విద్యార్థులు పాల్గొన్నారు.