హైదరాబాద్ అంకుర హోమ్స్ కు అరుదైన అవార్డు

హైదరాబాద్ అంకుర హోమ్స్ కు అరుదైన అవార్డు
* ఇన్నోవేటివ్ రెసిడెన్షియల్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందిన సంస్థ

రచ్చబండ, శంకర్ పల్లి: కొత్త తరానికి సరిపడే డిజైన్స్, సౌకర్యాలతో రాజీలేని నాణ్యతతో నిర్మిస్తున్న విల్లాలను నిర్మిస్తున్న హైదరాబాద్ కు చెందిన అంకుర హోమ్స్ సంస్థను ఇన్నోవేటివ్ రెసిడెన్షియల్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో ముంబాయికి చెందిన adsink జి బిజినెస్ భాగస్వామ్యంతో ముంబైలో బుధవారం సత్కరించింది అంకుర హోమ్స్ సంస్థ భాగస్వామి వెంకట్ మోగంటి ఈ అవార్డును స్వీకరించారు.

 

ఈ సందర్భంగా సంస్థ భాగస్వాములు జైపాల్ రెడ్డి, రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ వినూత్న డిజైన్లతో గృహాలను నిర్మిస్తున్నామని తెలిపారు. పచ్చదనం అలలారే మధ్య గృహాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అన్ని సౌకర్యాలతో అందుబాటు ధరలతో నిర్మిస్తున్న తమ వెంచర్లకు కొనుగోలుదారుల నుండి మంచి స్పందన వస్తున్నదని చెప్పారు. ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తున్నదని తెలిపారు.

కొత్తదనంతో మరిన్ని బహుళ అంతస్తుల గల నిర్మాణాలను తమ సంస్థ నిర్మిస్తున్నదని చెప్పారు. ఈ నిర్మాణాలకు అన్ని అనుమతులు ఉన్నాయని వారు తెలిపారు.