సోషల్ మీడియా మోసాలపై అవగాహన ఉండాలి
* ఐపీఎస్ అధికారి సాధన రష్మీ పెరుమాళ్
* మోకిలా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులకు నేరాలపై అవగాహన
రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలం మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, ప్రాచీన్ గ్లోబల్ స్కూల్లో చర్య విద్యార్థులకు చైల్డ్ సేఫ్టీ క్లబ్, ఆడపిల్లలపై జరిగే నేరాలపై అవగాహన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐపీఎస్ అధికారి సాధన రష్మీ పెరుమాళ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నేరాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా తమ వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మైనర్ బాల బాలికలకు వాహనాలు నడపడానికి ఇవ్వకూడదని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదు అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాటి బారిన పడకుండా ఉండాలని సూచించారు. అలాగే మాదకద్రవ్యాలు వాడకం వల్ల జరిగే పరిణామాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు కలిగే సమస్యల పైన ప్రతి పాఠశాలలో ఒక చైల్డ్ సేఫ్టీ క్లబ్బును ఏర్పాటు చేయడం జరిగిందని ఐపీఎస్ అధికారి తెలిపారు.
ఈ క్లబ్బులో ఇద్దరు సభ్యులుగా ఉపాధ్యాయులు, ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు తల్లిదండ్రులు, ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఉంటారని చెప్పారు. ఫిజికల్ సేఫ్టీ, మెంటల్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ, ఆంటీ డ్రగ్స్ సేఫ్టీ,, ఈ విషయాలు ఏవైనా సమస్యలు వచ్చిన వెంటనే విద్యార్థులు వారి సమస్యలను ఒక పత్రంపై రాసి ఫిర్యాదు బాక్సులు వేస్తే, ఆ ఫిర్యాదులపై క్ సభ్యులు స్పందించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. సైబర్ క్రైమ్ కు గురైన బాధితులు తక్షణమే భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1930 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. షీ టీం గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో మోకిలా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ. పి. నరేష్, సబ్ ఇన్స్పెక్టర్లు సి. కోటేశ్వరరావు, కె. కృష్ణ ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.