సీఎం రేవంత్ రెడ్డి గారూ ఐనవోలు జాతరకు రండి

సీఎం రేవంత్ రెడ్డి గారూ ఐనవోలు జాతరకు రండి

* మంత్రి సురేఖతో కలిసి ఆహ్వాన పత్రికను అందించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు

 

రచ్చబండ, హైదరాబాద్: ప్రతిష్టాత్మక దేవాలయమైన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల (జాతర)కు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆహ్వానించారు.

మంగళవారం హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని దేవాదాయ- ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా శ్రీ మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని అందజేసి బ్రహ్మోత్సవాల(జాతర) కు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు, హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్ రెడ్డి, సీనియర్ న్యాయవాది నిమ్మాని శేఖర్ రావు, సీనియర్ నాయకులు కుందూరు వెంకట్ రెడ్డి, వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి, యువ నాయకులు గొట్టిముక్కల రమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.