శాంతియుతంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర

శాంతియుతంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర

* చేవెళ్ల శాసనసభ్యులు కాలు యాదయ్య
రచ్చబండ, శంకర్ పల్లి: వినాయక చవితి నవరాత్రుల అనంతరం గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవడం సంతోషకరమని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల శాసనసభ్యులు కాలు యాదయ్య అన్నారు.

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపురంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే అన్ని పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత ధార్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా, గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డి. వెంకట్ రెడ్డి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ జొన్నాడ రాములు తదితరులు పాల్గొన్నారు.