శంకర్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికై నిరంతరం పాటుపడతా

శంకర్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికై నిరంతరం పాటుపడతా

* మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్

 

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికై నిరంతరం పాటుపడతానని చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటికే మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో అండర్ డ్రైనేజ్ మురికి కాలువలు, సిసి రోడ్లు వేయడం జరిగిందన్నారు. వార్డుల్లోని ప్రతి కాలనీలో విద్యుత్ దీపాలు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణంలో హైదరాబాద్ రోడ్డుకు సెంట్రల్ లైటింగ్ వేశామని చెప్పారు. అలాగే బుల్కాపురం పరిధిలో కూడా సెంట్రల్ లైటింగ్ వేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో అవసరమైన చోట స్మశాన వాటికలు ఏర్పాటు చేశామని చెప్పారు.

 

మున్సిపాలిటీలో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ భానూరు వెంకటరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు జూలకంటి శ్వేతా పాండురంగ రెడ్డి, పార్శి రాధా బాలకృష్ణ, ఎం. చంద్రమౌళి, గండేటి శ్రీనాథ్ గౌడ్, జూలకంటి లక్ష్మమ్మ రాంరెడ్డి, సిహెచ్. అశోక్, గోపాల్, సంధ్యారాణి అశోక్ కుమార్, జొన్నాడ రాములు, నూర్జహాన్ బేగం, సంతోష్ రాథోడ్, కో ఆప్షన్ సభ్యులు, షబానా బేగం, రజని శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, మహమూద్, అధికారులు పాల్గొన్నారు. అనంతరం బదిలీపై వెళ్లిన జ్ఞానేశ్వర్ కు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఘనంగా శాలువతో సత్కరించి వీడ్కోలు పలికారు.