శంకర్ పల్లి మున్సిపాలిటీలో దశలవారీగా మౌలిక వసతుల కల్పన

శంకర్ పల్లి మున్సిపాలిటీలో దశలవారీగా మౌలిక వసతుల కల్పన

* మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని 13, 14వ వార్డుల్లో గురువారం మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ సీసీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వార్డులలో దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి, శంకర్ పల్లి ఏఎంసి మాజీ చైర్మన్ వై. ప్రకాష్ గుప్తా, నాయకులు ప్రవీణ్ కుమార్, పార్శి బాలకృష్ణ, జూలకంటి పాండురంగారెడ్డి, సతీష్ రెడ్డి, రఘునందన్ రెడ్డి కాలనీ వాసులు పాల్గొన్నారు.