శంకర్ పల్లిలో డబుల్ ఇండ్ల కోసం ధర్నా చేస్తున్న బీజేపీ నేతలకు మాజీ ఎంపీ కొండా సంఘీభావం

శంకర్ పల్లిలో డబుల్ ఇండ్ల కోసం ధర్నా చేస్తున్న బీజేపీ నేతలకు మాజీ ఎంపీ కొండా సంఘీభావం

రచ్చబండ శంకర్ పల్లి: శంకర్ పల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట పేదల డబుల్ బెడ్ రూమ్ లకు మండల బిజెపి నాయకులు చేస్తున్న మహాధర్నా శిబిరానికి గురువారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతాలలో నివసిస్తున్న పేదలను సీఎం కేసీఆర్ విస్మరించారని దుయ్యబట్టారు.

హైదరాబాదులో నివాసముంటున్నవారికి ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ లు కట్టి ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. వెంటనే నియోజకవర్గంలోని ఇల్లు లేని పేదలను అధికారులు, నాయకులు గుర్తించి వారికి డబుల్ బెడ్ రూములు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిజెపి అధికార ప్రతినిధి తొండ రవి. బిజెపి రాష్ట్ర నాయకులు ప్రభాకర్ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ బిజెపి కన్వీనర్ ప్రతాపరెడ్డి, మండల బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ సింగ్, మున్సిపల్ బిజెపి అధ్యక్షుడు బీర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కాగా డిప్యూటీ తహసిల్దార్ ప్రియాంకకు వినతి పత్రాన్ని అందించారు.