విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి
* మున్సిపల్ కౌన్సిలర్ బొడ్డు లావణ్య శ్రీనివాస్ రెడ్డి
రచ్చబండ, శంకర్ పల్లి: విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని శంకర్ పల్లి మున్సిపాలిటీ లోని సింగాపురం 10 వ వార్డు కౌన్సిలర్ బొడ్డు లావణ్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తమ పెళ్లిరోజు సందర్భంగా సింగపూర్ లోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్కులు, బ్యాగులు, ప్యాడ్స్, స్టేషనరీ వస్తువులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రతి ఒక్కరు చేయూతని ఇవ్వాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు వారు మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ సంతోష్ రాథోడ్ ఉపాధ్యాయులు, గీతాంజలి, లలిత, నాయకులు బొడ్డు పాపిరెడ్డి, రాజేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, మల్లేష్, సురేష్, ప్రశాంత్, వంశీధర్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.