వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు సైకిళ్లు వితరణ

*వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు సైకిళ్లు వితరణ *
రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ఇంద్రారెడ్డి నగర్, మిర్జాగూడ, పాఠశాల ప్రొద్దుటూరు ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు సైకిళ్లను మండల విద్యాధికారి సమక్షంలో ఫౌండేషన్ సభ్యులు చిన్న,నాయుడు, సామాజిక కార్యకర్త ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ సోమవారం అందించారు.

ఈ సందర్భంగా మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ బాలిక విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాల్మీకి ఫౌండేషన్ వివిధ ప్రాంతాల నుండి కాలినడకన వచ్చి చదువుకునే పేద విద్యార్థినులకు లేడీ బర్డ్ సైకిళ్లు ఉపయోగకరంగా ఉంటాయని భావించి శంకర్పల్లి మండలంలో గత జూన్ నుండి ఇప్పటివరకు 30 సైకిళ్లు పంపిణీ తెలిపారు.బాలికలకు వాల్మీకి ఫౌండేషన్ ఎప్పుడు తోడుగా ఉంటుందని,బాలికలు ఎందులో కూడా తక్కువ కాకుండా అన్ని రంగాల్లో రానించాలని అన్నారు.,చదువుతోనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామనీ, అమ్మాయిలు అబ్బాయిలతో పాటు సమానంగా విద్య,ఉద్యోగ రంగాల్లో రాణించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపినపుడే నిజమైనటువంటి స్వాతంత్ర్యం సిద్ధించినట్లు అవుతుందని పేర్కొన్నారు.

బాలికలు ఏమాత్రం ఏమరపాటుకు, భయభ్రాంతులకు గురికాకుండా ఏకాగ్రతతో చక్కగా చదువుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు నర్సింగ్ రావు,ఉపాధ్యాయులు, శ్రీనివాస్,సత్యనారాయణ,
వెంకటేష్,దేవేందర్ రెడ్డి, జగదీష్,దీపికరాణి,లలిత,పద్మ,
జ్యోతిర్మయి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.