రైతు సమస్యలుతీర్చాలని రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా
రచ్చబండ, శంకర్ పల్లి: రైతు సమస్యలను తీర్చాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపుమేరకు గురువారం శంకర్ పల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట మండల రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక తహసిల్దార్ సురేందర్ కి తమ డిమాండ్ల ఫిర్యాదును అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభు లింగం మాట్లాడుతూ బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ చట్టం 20 20 లోని సెక్షన్ 12/1 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర సహకార సంఘాల సవరణ చట్టం 2023లోని సెక్షన్ 26ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాలు రద్దు అయితే రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మండల రైతు సంఘం నాయకులు పి. సుధీర్, శివరాజ్, బుచ్చయ్య, జంగయ్య, మహిళ రైతు సంఘం నాయకురాలు చిలుకమ్మ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.