రైతుల సమస్యలపై శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ నిరసన
* డిప్యూటీ తహసీల్దార్ ప్రియాంకకు వినతిపత్రం అందజేత
రచ్చబండ, శంకర్ పల్లి: రైతుల సమస్యలు తీర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు కార్యదర్శి ఎం. ప్రభు లింగం తెలిపారు. మంగళవారం రాష్ట్ర రైతుల సంఘం పిలుపుమేరకు శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తూ డిప్యూటీ తహసీల్దార్ ప్రియాంకకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర సీపీఐ ఇచ్చిన పిలుపుమేరకు 9, 10 తేదీలలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రైతుల డిమాండ్లు లక్ష రూపాయలు రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని స్వామినాథన్ కమిటీ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన రైతులకు వ్యవసాయ కూలీలకు పదివేల రూపాయలు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ధరణిలో జరిగిన లోటుపాటులను సవరించాలి కోరారు. శంకర్ పల్లి మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూములు స్థానికులకు ఇవ్వకుండా హైదరాబాదులో నివసిస్తున్న వారికి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇల్లు లేని స్థానికులకు కట్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అధ్యక్షుడు సుధీర్ కుమార్, జిల్లా నాయకురాలు అమృత, నాని, చంద్రయ్య, రైతులు చిలుకమ్మ, జంగయ్య, బుచ్చయ్య, అంతయ్య, వెంకటయ్య, నరసింహులు, అంతయ్య తదితరులు పాల్గొన్నారు.