రెండు బైకులు ఢీకొని వ్యక్తి దుర్మరణం 

రెండు బైకులు ఢీకొని వ్యక్తి దుర్మరణం

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో గురువారం రెండు బైకులు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి అంతప్ప గూడ గ్రామానికి చెందిన వడ్డే సురేష్ (35) తాపీ మేస్త్రి గా పనిచేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు.

కాగా గురువారం సాయంత్రం పనుల నిమిత్తం చేవెళ్ల మండలంలోని ఎంకేపల్లి గ్రామానికి తన అక్కను బైక్ పై ఎక్కించుకొని వెళ్తున్నాడని చెప్పారు. ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీ కొట్టడంతో వడ్డే సురేష్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అయితే అంతకుముందు బైక్ లో పెట్రోల్ అయిపోవడంతో అక్కని రోడ్డుపై దిగబెట్టి పెట్రోల్ తేవడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.