రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రావడం ఖాయం
* చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్.
రచ్చబండ, శంకర్ పల్లి: తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భరత్ అన్నారు. శుక్రవారం శంకర్ పల్లి లోని ఎస్ఎం గార్డెన్స్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భీమా వ్యక్తం చేశారు. ఓటర్లు బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల మాటలకు మోసపోవద్దని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంలో చేసిన ఆరు వాగ్దానాలను తప్పకుండా నెరవేర్చుతుందని చెప్పారు.
టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసిన వారు ఈసారి గెలవలేరని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలన అంతం కాబోతుందని తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గం లోని గ్రామాలలో అనుకున్నంత అభివృద్ధి పనులు జరగలేదని చెప్పారు. గ్రామాల రోడ్లు అద్వానంగా తయారయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన భీమ్ భరత్ ను మండలంలోని పలు గ్రామాల సర్పంచులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి కె. ఉదయ మోహన్ రెడ్డి, శంకర్ పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మైనారిటీ అధ్యక్షుడు ఎండి అజాజ్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.