యువకులు సన్మార్గంలో నడవాలి

యువకులు సన్మార్గంలో నడవాలి
* నార్సింగి ఏసీపీ లక్ష్మీనారాయణ

రచ్చబండ, శంకర్ పల్లి: యువకులు సన్మార్గంలో నడవాలని నార్సింగి ఏసీపీ లక్ష్మీనారాయణ సూచించారు. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం మోకిలా గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని అయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయడం సంతోషకరమని అన్నారు. రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణం రక్షించిన వారవుతారని కొనియాడారు. యువత చెడు మార్గాన్ని ఎంచుకోవద్దని హితవు పలికారు. గ్రామాలలో యువకులు మంచిమార్గంలో నడుస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మోకిలా సీఐ నరేష్, ఎస్సై కృష్ణ, పోలీస్ సిబ్బంది, నాయకులు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.