మానవ జీవితంలో మొక్కలకు విశేష ప్రాధాన్యం

మానవ జీవితంలో మొక్కలకు విశేష ప్రాధాన్యం

* శంకర్ పల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్

రచ్చబండ, శంకర్ పల్లి: మానవ జీవితంలో మొక్కలు విశేష ప్రాధాన్యమైనవని శంకర్ పల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు రామంతపురం వార్డు కార్యాలయంలో ప్రజలకు బాలవికాస్ ఆధ్వర్యంలో ఎఫ్ఎఐ సహకారంతో ప్రజలకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ చెట్ల వల్ల ప్రాణవాయు లభిస్తుందని, సమస్త మానవకోటికి ఆహారం, పండ్లు, కలప మొదలగునవి లభిస్తున్నాయని గుర్తు చేశారు.

పండ్ల మొక్కలను ఇంటి పెరట్లో పెంచుకోవడం వల్ల రసాయనాలు లేని పండ్లు లభించుటయే కాక ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు. కాగా బాల వికాస్ సంస్థ ప్రతినిధి రెహమాన్ మాట్లాడుతూ రైతులు 20 గుంటల పొలములో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండ్ల తోటలు పెంచితే వారి వద్ద నూటిలో 10% రూపాయలు తీసుకొని వారికి 50 పండ్ల మొక్కలను అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వియం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సిహెచ్. అశోక్, గండేటి శ్రీనాథ్ గౌడ్, సంతోష్ రాథోడ్, కో ఆప్షన్ సభ్యుడు వెంకటరెడ్డి, శంకర్ పల్లి మాజీ సర్పంచ్ ఎం సాని ప్రకాష్ గుప్తా, నాయకులు పి. బాలకృష్ణ, బొడ్డు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.