మహిళ మెడలోంచి పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగుడు
రచ్చబండ, శంకర్ పల్లి : పొలానికి నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని దొంగ తెంపుకొని పారిపోయిన సంఘటన శనివారం శంకర్ పల్లి మండలంలోని మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పోలీస్ స్టేషన్ పరిధిలోని పిలిగుండ్ల గ్రామానికి చెందిన ధరణి బుచ్చమ్మ శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పొద్దుటూరు గేటు సమీపంలో ఉన్న తన పొలానికి నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్ పైన వెనకాల నుండి వచ్చి బుచ్చమ్మ మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు తెంపుకొని పారిపోయాడని తెలిపారు.
ఆ వ్యక్తి నల్లని టీ షర్టు ధరించి ఉన్నాడని ఫిర్యాదురాలు దరఖాస్తులు పేర్కొన్నదని సిఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం సంఘటన స్థలాన్ని డీసీపీ రమణ గౌడ్, ఏసీపి, సిసిఎస్, స్కాట్ సిబ్బంది పరిశీలించారు.