మహిళలకు చీరలు పంపిణీ చేసిన మిర్జాగూడ ఉప సర్పంచ్ శాంతి కిషన్ సింగ్

మహిళలకు చీరలు పంపిణీ చేసిన మిర్జాగూడ ఉప సర్పంచ్ శాంతి కిషన్ సింగ్

రచ్చబండ, శంకర్ పల్లి: దసరా పండుగను పురస్కరించుకొని శంకర్ పల్లి మండలం మిర్జాగూడ గ్రామ ఉపసర్పంచ్ శాంతి కిషన్ సింగ్ ఆదివారం గ్రామంలోని మహిళలకు ఉచితంగా చీరలను అందించారు. అంతకుముందు గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దసరా పండుగ హిందువులకు పవిత్రమైన పండుగని అన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులపాటు మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారని తెలిపారు.

ప్రతి ఒక్కరు హిందూ ధర్మాన్ని పాటించాలని సూచించారు. నేడు నిర్వహించుకునే దసరా పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు నరేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.