మహాలింగాపురంలో పీఏసీఎస్ గోదాము ప్రహరీ కూల్చిన

మహాలింగాపురంలో పీఏసీఎస్ గోదాము ప్రహరీ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి
* శంకర్ పల్లి పీఏసీఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి

రచ్చబండ, శంకర్ పల్లి : శంకర్ పల్లి మండలంలోని మహాలింగాపురంలో గల సహకార సంఘం గోదాము గోడను కూల్చిన వారిపై ఇప్పటివరకు స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని శంకర్ పల్లి పిఏ సిఎస్ డైరెక్టర్ కాడి గారి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన టి. బిక్షపతి అలియాస్ బుచ్చయ్య తనకు నడవడానికి దారి లేదని మేము నిర్మించిన గోదాము ప్రహరీని కూల్చివేశారని తెలిపారు. విషయమై ఈనెల 8వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు కూల్చిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన తెలిపారు. శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి స్వయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పారు.

వెంటనే పిఎసిఎస్ గోడను కూల్చిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.