మరకత శివలింగాన్ని దర్శించుకోవడం నా అదృష్టం
* సినీ నటుడు హరీశ్
రచ్చబండ, శంకర్ పల్లి; శంకర్ పల్లి మండలంలోని చెందిప్ప గ్రామంలోని మరకత శివలింగాన్ని దర్శించుకొని పూజలు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రేమఖైదీ సిని హీరో, ప్రముఖ నటుడు హరీశ్ అన్నారు. ఆదివారం ఆయన చందిప్ప గ్రామంలో వెలసిన శివలింగానికి పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పచ్చని పొలాల మధ్య శివాలయం ఎంతో శోభాయ మయంగా ఉందని తెలిపారు. 11వ శతాబ్దంలోని చాణుక్య రాజులు ప్రతిష్టించిన ఈ ఆకుపచ్చ శివలింగాన్ని చందిప్ప గ్రామస్తులు భద్రంగా కాపాడుకోవడం ఎంతో అదృష్టమని అన్నారు. దేశంలో ఇలాంటి ఆకుపచ్చ శివలింగాలు అరుదుగా ఉంటాయని చెప్పారు. పూజల అనంతరం దేవాలయ కమిటీ చైర్మన్ సదానంద గౌడ్ నటుడు హరీష్ కు శాలువాతో సన్మానించి మరకత శివలింగ చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.