బైక్ దొంగలను పట్టుకున్న శంకర్ పల్లి పోలీసులు

బైక్ దొంగలను పట్టుకున్న శంకర్ పల్లి పోలీసులు

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి శుక్రవారం ఇద్దరు దొంగలు సాయి నగర్ లో నివసించే గోపాల్ రెడ్డి ఇంటి ముందు నుంచి దొంగలించిన బైకును శంకర్ పల్లి పోలీసులు చాకచక్యంతో శనివారం బైక్ తో పాటు దొంగలను పట్టుకున్న సంఘటన జరిగింది.

డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఏ. నాగరాజు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి స్థానిక సాయి నగర్ లో నివసించే గోపాల్ రెడ్డి ఇంటి ముందు నుంచి స్థానికంగా నివసించే మాల రాజు, షేక్ అబ్దుల్ దొంగలించారని తెలిపారు. కాగా శనివారం వీరిద్దరూ అనుమానస్పదంగా కనిపించడంతో వారిని అదుపులో తీసుకొని విచారించగా తామే గోపాల్ రెడ్డి హోండా స్ప్లెండర్ ప్లస్ బైక్ ను దొంగలించామని తెలిపారు అన్నారు.

కాగా వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించామని డి ఐ. నాగరాజు తెలిపారు.