బతుకమ్మ చీరల్లో కేసీఆర్ అనురాగం, నేతన్న శ్రమను గుర్తించాలి
* విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
* శంకర్ పల్లిలో బతుకమ్మ చీరలు పంపిణీ
* ఆడిటోరియం ప్రారంభం
* యువతకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ
రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మునిసిపాలిటీ పరిధిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ.1.80 కోట్లతో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంను ప్రారంభించి, మహిళలకు బతుకమ్మ చీరలు, యువతకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకట్ రాంరెడ్డి, స్థానిక కౌన్సిలర్ శ్వేతా పాండురంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ పాపారావు, సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ 250 డిజైన్లలో 1.02 కోట్ల బతుకమ్మ చీరలను 354 కోట్ల రూపాయలతో చేనేత సంఘాల ఆధ్వర్యంలో తయారీ చేశారన్నారు. జరీతోపాటు వివిధ రంగుల కాంబినేషన్‌తో 250 డిజైన్లలో ఆకర్షణీయంగా చీరలను తయారీ చేసినట్లు తెలిపారు. 2017 నుంచి 2022 వరకు 5.81 కోట్ల చీరలను ఆడబిడ్డలకు అందించామన్నారు. బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిస్తోందని, ఈ సందర్భంగా మహిళలకు ముందస్తుగా మంత్రి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల తదితర ప్రాంతాల్లోని నేతన్నలతో వీటిని తయారు చేయిస్తున్నారన్నారు. ఏటా సుమారు ఒక కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తుండగా, ఈ ఏడాది కూడా 1 కోటి.02 లక్షల చీరలను మహిళలకు చౌకధర దుకాణాల ద్వారా నేటి నుండి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.రంగారెడ్డి జిల్లాలో 4 లక్షల 29 వేల చీరలు పంపిణీ చేస్తున్నట్లు, శంకర్ పల్లి మండలంలో 14 వేల బతుకమ్మ చీరలు, మునిసిపాలిటీ 5 వేలు అందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 25 వేల స్పోర్ట్స్ కిట్స్, ఒక్కొక్కటి 47 వేల విలువ చేసేవి ఒక్కో క్రీడా ప్రాంగణానికి ఒకటి కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి కిట్ లో 23 రకాల ఐటమ్ లు 75 టీ షర్ట్ లు ఉంటాయన్నారు. రంగారెడ్డి జిల్లాలో 547 కిట్లు,చేవెళ్లలో 25, శంకర్ పల్లిలో 26,శంకర్ పల్లి మున్సిపాలిటీ 04 చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపారు.జిహెచ్ఎంసీ నిధులతో 111 స్థలాల్లో డబుల్ బెడ్ రూమ్ లు కట్టారని వాటిలో 10 శాతం స్థానిక కోటా కింద అందిస్తున్నట్లు తెలిపారు. పేదలకు ప్రభుత్వ స్థలాల్లో 75 గజాల స్థలాలు ఇస్తున్నట్లు, 3 లక్షలు అర్హులైన వారికి ఇళ్ల నిర్మాణానికి గృహ లక్ష్మీ కింద అందిస్తున్నట్లు తెలిపారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు ఇచ్చి ఆడబిడ్డల నీటి కష్టాలు తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్ ఇస్తూ, ఎకరాకు 10 వేలు రైతు బంధు,5 లక్షల రైతు భీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ నిలుస్తోందన్నారు.నేడు దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా పల్లెల, పట్టణాల రూపురేఖలు మర్చివేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కుతుందన్నారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న కాలే యాదయ్య ను మూడో సారి గెలిపించి, హ్యాట్రిక్ విజయాన్ని అందించాలన్నారు.మూడో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం గా ప్రజల ఆశీర్వదాలతో తిరిగి ఎన్నికవుతారని ఆశాభావం వ్యక్తం చేసారు.
ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.దేశానికే ఆదర్శంగా నిలిచేలా కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీకారం చుడుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మార్కేట్ చైర్మన్లు డి వెంకట్ రెడ్డి ,రాజు నాయక్,మార్కెట్ వైస్ ఛైర్మన్ కురుమ వెంకటేష్,సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు మిర్జాగూడ గ్రామ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్, గోపాల్, వాసుదేవ్ కన్నా, గోవర్ధన్ రెడ్డి, పార్శీ బాలకృష్ణ, బి వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ వెంకన్న, కమిషనర్ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్ లక్ష్మమ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారు.