ప్రజలకు ఉపయోగపడేలా యువజన సంఘాలు ఉండాలి
* చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య.
రచ్చబండ, శంకర్ పల్లి: ప్రజలకు ఉపయోగపడేలా యువజన సంఘాలు ఉండాలని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం శాసనసభ్యులు కాలే యాదయ్య అన్నారు. బుధవారం శంకర్ పల్లి అరుణోదయ యువజన సంఘం నూతన కార్యవర్గం, ఎన్నికైన అధ్యక్షులు జూలకంటి పాండురంగారెడ్డి ఎమ్మెల్యే నివాస పైన చించల్ పెట్ గ్రామంలో కలిసి, తమ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులు చెడు అలవాట్లను దూరం చేసుకోవాలని సూచించారు. పట్టణాలు, గ్రామాలలో యువకులు యువజన సంఘాలు ఏర్పాటు చేయవలసిసుకోవడం సంతోషకరమన్నారు.
గ్రామాలలో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే ప్రజలను ఈ యువజన సంఘాల సభ్యులు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, ఏం సి చైర్మన్ పాపారావు, శంకర్ పల్లి మాజీ ఉప సర్పంచ్ సాతా ప్రవీణ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, అరుణోదయ యువజన సంఘం మాజీ అధ్యక్షులు ప్రణీత్( చిన్న) సంజిత్ కుమార్, కాశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.