పొలం ఇనుపకంచే ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
* మహాలింగాపురం మాజీ సర్పంచ్ కోమటిరెడ్డి సురేష్ రెడ్డి
* శంకర్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామ శివారులో తమ పొలాలకు వేసుకున్న ఇనుపకంచెను దౌర్జన్యంగా ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహాలింగాపురం గ్రామ మాజీ సర్పంచ్ కోమటిరెడ్డి సురేష్ రెడ్డి శనివారం శంకర్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ విలేకరులతో మాట్లాడుతూ మహాలింగాపురం గ్రామంలో తమకు సర్వేనెంబర్ 631లో 5-18 ఎకరాలు, 632లో 9 ఎకరాల పైగా, 625లో రెండు ఎకరాలకు పైగా పొలం ఉందని తెలిపారు. కాగా ఈ పొలాల చుట్టూ తాము ఇనుపకంచెను వేయించామని తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన నలుగురు కలిసి శనివారం జేసీబీతో తన పొలానికి వేసిన ఇనుపకంచెను దౌర్జన్యంగా తొలగించారని తెలిపారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిఐ వినాయక్ రెడ్డి కి ఫిర్యాదు చేశామని తెలిపారు.