పొద్దుటూరులో రెండు గణేష్ లడ్డూలకు భారీ డిమాండ్

పొద్దుటూరులో రెండు గణేష్ లడ్డూలకు భారీ డిమాండ్

* లక్షకు పైగా పలికిన ధర
* కైవసం చేసుకొన్న టీఎంఎచ్డీ నేత మందుముల లక్ష్మణ్
రచ్చబండ, శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దుటూరు గ్రామంలోని క్రాంతి యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక వేదిక వద్ద శుక్రవారం రాత్రి గణేశుని లడ్డూల వేలం సందడిగా సాగింది. రెండు లడ్డూలను కైవసం చేసుకునేందుకు అనేకమంది భక్తులు పోటీ పడ్డారు. గ్రామానికి చెందిన (టీఎంఎచ్డీ) తెలంగాణ మాదిగ హక్కుల దండోరా స్టేట్ సెక్రటరీ, పొద్దుటూరు గ్రామ స్థానికుడు మందుముల లక్ష్మణ్ రెండు లడ్డూలను వేలంలో కైవసం చేసుకున్నాడు. మందుమూల లక్ష్మణ్ మొదటి లడ్డును 1.50 లక్షలకు, రెండవ లడ్డూను 1.09 లక్షలకు కైవసం చేసుకున్నాడు.

ఈ లడ్డుల వేలంపాటను భక్తులందరూ ఎంతో ఆసక్తితో తిలకించారు, వేలం పాటలో, లక్ష్మణ్ కు పోటీ వచ్చిన వారు, ఒకింత కలవరానికి గురయ్యారు. ఈ సందర్భంగా వినాయక మంటప ప్రాంతమంతా సందడి నెలకొంది. పొద్దుటూరు గ్రామంలో 2023 సంవత్సరానికి అధిక ధరకు లడ్డూలు కైవసం చేసుకున్న రికార్డు లక్ష్మణ్ పేరు మీద నమోదు అయ్యింది. తర్వాత గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మణ్ ను ఘనంగా సన్మానించి, భాజా భజంత్రీలతో ఇంటి వరకు సాగనంపారు.

ఈ కార్యక్రమంలో, పొద్దుటూరు గ్రామ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి, ఎంపీటీసీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ కె శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గండి చెర్ల గోవర్ధన్ రెడ్డి, బీఎస్పీ పార్టీ అధ్యక్షులు ఆశిగల్ల నగేష్ బాబు, మాజీ ఉప సర్పంచ్, ప్రస్తుత వార్డు నెంబర్, నరసింహ, గ్రామపంచాయతీ సభ్యులు చాకలి రాములు, క్రాంతి యూత్ క్లబ్ ప్రసిడెంట్ నాని ప్రభాకర్, అంబేద్కర్ యూత్ క్లబ్ ప్రసిడెంట్ బూడుదుల మహేందర్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.